అమరావతిలో భారీ బహిరంగసభకు కెసిఆర్‌ యోచన

ఏపీ బాధ్యతలను తలసానికి అప్పగించిన కేసీఆర్

kcr-appoints-talasani-as-brs-ap-incharge

న్యూఢిల్లీః తెలంగాణ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారింది. బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి విస్తరించాలనే యోచనలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉన్నారు. ఏపీలో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బిఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అప్పగించినట్టు సమాచారం. సంక్రాంతికి ఏపీలో బిఆర్ఎస్ అడుగుపెట్టబోతోంది.

ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగసభను నిర్వహించాలని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ బాధ్యతలను కూడా తలసానికి కేసీఆర్ అప్పగించారు. ఏపీ మూలాలు ఉండి హైదరాబాద్ లో ఉన్న ప్రముఖులతో కెసిఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. జాతీయ పార్టీ అధికారిక గుర్తింపు కోసం తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే యోచనలో కెసిఆర్ ఉన్నారు. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/