టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులను ప్రకటించిన కేసీఆర్ ..

టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. బండా ప్ర‌కాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక‌వ‌డంతో.. ఆయ‌న త‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇక ధ‌ర్మ‌పురి శ్రీనివాస్, కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో మ‌రో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మూడు స్థానాల‌కు అభ్య‌ర్థుల పేర్ల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించారు.

హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) , న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు పేర్ల‌ను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి త‌గినంత‌ సంఖ్యా బలం ఉండటంతో ఈ మూడు రాజ్యసభ సీట్లు అధికార పార్టీకే దక్కనున్నాయి. బండ ప్రకాశ్ రాజీనామాతో అయిన సీటుకు రేపటిలోగా, మిగతా రెండు సీట్లకు ఈ నెల 24లోపు నామినేషన్ వేయాలి.