జూన్ 24, 30 మధ్య గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ – సీఎం కేసీఆర్

జూన్ 24, 30 మధ్య గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. జూన్ రెండో తేదీ నుంచి మూడు వారాలు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో గురువారం సమావేశమైన కేసీఆర్..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
2,845 గ్రామాల్లో 4,01,405 ఎకరాలకు సంబంధించిన పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. దీన వల్ల లక్షా యాభైవేల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారు. పోడు భూములు అందుకన్న ప్రతి లబ్దిదారుడికి బ్యాంకు ఖాతా తెరవనున్నారు. ఈ ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా డబ్బులు జమ చేయనున్నారు. 3.08 లక్షల మంది ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతుబంధును ఇవ్వనున్నట్లు తెలిపారు.