కెసిఆర్‌ మొనార్కులా వ్యవహరిస్తున్నాడు: లక్ష్మణ్‌

k lakshman
k lakshman

హైదరాబాద్‌: 20 రోజులుగా ఆర్టీసీ కార్మికులు శాంతి యుతంగా సమ్మె చేస్తుంటే సీఎం కెసిఆర్‌ రెచ్చగొట్టేలా మాట్లడుతున్నారని బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. హుజుర్‌నగర్‌లో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వత కెసిఆర్‌ ఇష్టం వచ్చినట్టు మట్లాడుతున్నారు. నిజామబాద్‌లో కవిత ఒడిపోయినపుడు మరియు ముగ్గురు ఎమ్మెల్సీ ఒడిపోయినపుడు మీడియా సమావేశం పెట్టని కెసిఆర్‌ ఇప్పుడు ఉప ఎన్నికలో గెలిచిన వెంటనే ప్రెస్‌ మీట్‌ పెట్టి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని అన్నారు. నంద్యాలలో ఉప ఎన్నికలలో గెలిచినపుడు చంద్రబాబు కుడా ఇదేవిధంగా రెచ్చిపోయి మట్లాడినాడు కాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యాడు కెసిఆర్‌ నీకు కుడా అదేగతి పడుతుందని ప్రజలు చుస్తున్నారు ఖచ్చితంగా బుద్ది చెబుతారు అని లక్ష్మణ్‌ అన్నారు. రాజకీయాలు ఎమైనా వుంటే మాతో తెల్చుకొవాలని అమాయకులైన ఆర్టీసీ కార్మికులపై నీ ప్రతాపం చూపవద్దని దమ్ముంటే మాతో పెట్టుకో అని లక్ష్మణ్‌ సవాలు విశిరారు. ఆర్టీసీ ఆస్థులను రక్షించుకొవడానికి బిజెపి ఈ సమ్మెను బలోపేతం చేస్తుందని తెలిపారు. కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఆర్టీసీ కార్మికులకు భరోసానిచ్చారు. కార్మికులరా ఆత్మహత్యలు చెసుకొవద్దు ఆర్టీసీ తలపెట్టె ప్రతి కార్యక్రమానికి బిజెపి మద్దతు ఉంటుందని లక్ష్మణ్‌ పెర్కొన్నారు.

తాజా జాతియ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/