కాంగ్రెస్‌కు రాజ్యసభ ఎంపి రాజీనామా

KC Ramamurthy
KC Ramamurthy


బెంగళూరు: కేంద్రంలోని ఎన్డీఎ ప్రభుత్వం సెప్టెంబరు 14న పార్లమెంట్‌ స్థాయి సంఘం సభ్యులు కొత్తగా నియమించింది. సిబ్బంది, ప్రజా, న్యాయ, చట్టాల వ్యవహారాల శాఖ సభ్యుడిగా కేసి రామమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వం కేసి రామమూర్తిని కీలక పదవిలో నియమించి నెలలోఏ ఆయన రాజ్యసభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. కర్ణాటక ఐపిఎస్‌ అధికారి కెసి రామమూర్తి రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేశారు. బెంగుళూరుకు చెందిన కెసి రామమూర్తి 2016 జూన్‌ 11న కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆస్కర్‌ ఫెర్నాండెజ్‌, జైరాంరమేష్‌తో పాటు కెసిరామమూర్తి కూడా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జెడిఎస్‌ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడడంతో కెసి.రామమూర్తి 52 ఓట్ల భారీ మెజారిటీతో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆస్కర్‌ ఫెర్నాండెజ్‌, జైరాంరమేష్‌లకు చేరో 46 ఓట్లు మాత్రమే వచ్చాయి. కెసి రామమూర్తి రాజ్యసభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామా తీవ్ర చర్చకు దారి తీసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/