కశ్మీర్‌ అంశంపై స్పందించిన కవిత

MP Kavitha
MP Kavitha

హైదరాబాద్‌: జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి నాలుగు చరిత్రాత్మక బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ సీనియర్ నాయకురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థికరణ చట్టంలో మార్పులు చోటుచేసుకున్న ఈ సమయంలో తన ప్రార్థనలు కశ్మీరీల వెన్నంటే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అక్కడి వారంతా ఇక సురక్షితంగా ఉంటారని.. అతి త్వరలో శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/