జాగృతి బతుకమ్మ సంబురాల పోస్టర్‌ ఆవిష్కరణ

Kavitha - Bathukamma Sambaralu 2019 Poster
Kavitha – Bathukamma Sambaralu 2019 Poster

హైదరాబాద్ : తెలంగాణతో పాటుగా వివిధ దేశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాలులో భాగంగా ముంబయి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్,ఖతర్, బహరైన్, కువైట్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో తెలంగాణ జాగృతి శాఖలు బతుకమ్మ నిర్వహిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో బతుకమ్మ నిర్వహణతో పాటుగా తెలంగాణ జాగృతి ఈ సారి 300కు పైగా కవయిత్రులతో మహా కవిసమ్మేళనం, ఆర్ట్ వర్క్ షాప్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కవితతో పాటు జాగృతి నాయకులు డాక్టర్ ప్రీతి రెడ్డి, మంచాల వరలక్ష్మి, నవీన్ ఆచారి, రాజీవ్ సాగర్, కొరబోయిన విజయ్, విక్రాంత్ రెడ్డి, వివిధ జిల్లాల అధ్యక్షులతో పాటు తదితరులు పాల్గొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/