ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన కవిత, కేటీఆర్‌, హరీష్‌రావు

ఎమ్మెల్సీ కవిత , మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు లు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు బయలుదేరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కవిత…ఈ నెల 11 న ఈడీ ముందు హాజరు కాగా..దాదాపు 09 గంటలపాటు అధికారులు విచారించారు. ఆ తర్వాత ఈరోజు (మార్చి 16 న ) మరోసారి హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీచేసింది. కానీ ఈరోజు ఈడీ ముందు కవిత హాజరుకాలేదు.

ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటామని కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ చెప్పారు. అధికారులు అడిగిన డాక్యుమెంట్లను అందజేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20 న విచారణ కు హాజరుకావాలని ఆదేశించింది. అంతే కాదు లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత అనుమానితురాలుగా ఈడీ కోర్ట్ కు తెలిపింది.

ఈ క్రమంలో ఢిల్లీ నుండి కవిత, కేటీఆర్ , హరీష్ రావు లతో పాటు మిగతా బిఆర్ఎస్ నేతలు హైదరాబాద్ కు పయనమయ్యారు. కవిత విచారణ నేపథ్యంలో వీరంతా ఢిల్లీకి వెళ్లడం జరిగింది.