త్వరలో జక్రాన్‌పల్లికి ఎయిర్‌పోర్టు

kavita
kavita


నిజామాబాద్‌: నిజామాబాద్‌ నియోజకవర్గంలోని జక్రాన్‌పల్లిలో టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జక్రాన్‌పల్లికి ఎయిర్‌పోర్టు త్వరలో రాబోతుందని అందుకు కావాల్సిన 800 ఎకరాల భూమి కొనుగోలు పరిశీలనలో ఉందని ఆమె అన్నారు. నిజామాబాద్‌లో ఐటి హబ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, రాబోయే తరం కోసం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. పిఎఫ్‌ కార్డు ఉన్న బిడి కార్మికులందరికీ మే నెల నుంచి రూ. 2వేలు పింఛను ఇస్తామని, డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్తత్తులను తయారు చేయిస్తామని చెప్పారు. ఎంపీగా మళ్లీ తనకు అవకాశమిస్తే శక్తి వంచన లేకుండా పని చేస్తాను అని ఉద్ఘాటించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/