ఐలాపూర్‌లో కవిత ఎన్నికల ప్రచార సభ

kavita
kavita, nizambad trs mp candidate


జగిత్యాల: లోక్‌సభ ఎన్నికలకు ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో నేతల ప్రచారం ఊపందుకుంది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల మండలం ఐలాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు నిజామాబాద్‌ ఎంపి అభ్యర్ధి కవిత హాజరయ్యారు. అంతకుముందు మహిళలు బతుకమ్మలతో కవితకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆకుల లలితతోపాటు, పలువురు ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల అభ్యర్ధుల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/andhra-pradesh-election-candidates-list/