బహరేన్‌లో కవిత జన్మదిన వేడుకలు

kavita b'day celebrations at behrain
kavita b’day celebrations at behrain


బహరేన్‌: బహరేన్‌ ఎన్నారై టిఆర్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో ఎంపి కవిత జన్మదిన వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా బహరేన్‌ టిఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షులు రాధారపు సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ..గల్ఫ్‌ బాధితుల కన్నీళ్లను తుడిచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి కవిత అని కొనియాడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు. రిబోయే రొజుల్లో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ అభిమానులు హాజరయ్యారు.