ఐసీసీ మహిళల టీ20కి పాప్‌స్టార్‌ క్యాటీపెర్రీ

katy perry
katy perry

సిడ్నీ: ఐసీసీ మహిళల టీ20 వచ్చే ఏడాది మార్చిలో జరుగుతున్న నేపథ్యంలో.. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో వేలాది మంది ముందు తన ప్రదర్శన ఉంటుందని అమెరికన్‌ పాప్‌ స్టార్‌ క్యాటీపెర్రీ ప్రకటించింది. దీంతో ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు మరో అదనపు ఆకర్షణ తోడైంది. అదే రోజు మహిళల దినోత్సవం కావడంతో ఒక మహిళల క్రీడా పోటీకి అత్యధికంగా అభిమానులు హాజరై రికార్డు నెలకొల్పేందుకు ఐసీసీ పట్టుదలతో ఉంది. 1999లో కాలిఫోర్నియాలో జరిగిన ఫిపా మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌కు హాజరైన 90,185 మంది రికార్డు బద్దలు కొట్టాలని కోరుకుంటుంది. ఆస్ట్రేలియా క్రీడా నినాదం ఆసీ ఆసీ ఓయి ఓయి ! అనే పదాలను ఉచ్చరిస్తున్న వీడియో క్లిప్‌ను క్వాటీపెర్రీ ఇన్‌స్ట్రామ్‌లో పెట్టారు. కాగా 2020, మార్చి 8న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ రోజున మెల్‌బోర్న్‌ నా ప్రదర్శనలో భాగమయి రికార్డులు బద్దలు కొట్టాలని క్వాటీపెర్రీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజున ఈ అద్బుతమైన మహిళలకు మద్దతుగా మనందరం గర్జిద్దాం అని క్వాటీపెర్రీ పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/