ఎల్లో స్కర్ట్ లో కైఫ్ సుందరి

మాజీ స్టార్ హీరోయిన్ అయినా వన్నె తరగని బ్యూటీ

katrina Kaif in a yellow skirt

‘బూమ్’ సినిమాతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కత్రినా.. వెంకటేష్ హీరోగా వచ్చిన ‘మల్లీశ్వరి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.

వెంటనే బాలకృష్ణతో నటించిన ‘అల్లరి పిడుగు’ ప్లాప్ అవడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ మాత్రం తన అంద చందాలతో ఇప్పటికీ అదరగొడుతూనే ఉంది.

అంతేకాదు బాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ ఎంత మంది వస్తున్నా వారందరికి పోటీనిస్తూ దూసుకుపోతోంది.

కత్రినా కైఫ్.. ఈ ముద్దుగుమ్మకి ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ పేరుకు తగ్గట్టే తన అందాలతో కైపెక్కిస్తూ ఉంటుంది.

నలభైకి దగ్గర పడుతున్న వయస్సులో కూడా తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ పొడుగుకాళ్ల సుందరి రెచ్చిపోయి ఫొటోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది. 

మాజీ స్టార్ హీరోయిన్ అయినా అందాల ఆరబోతలో తాజానే అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలో అమ్మడిని ఆరాధించే రసిక హృదయాలు ఇప్పుడు కైపెక్కించే కత్రినా ఫోటో ఒకటి బయటకి తీశారు. ఈ ఫోటోలో ఎల్లో కలర్ స్కర్ట్ ధరించి వయ్యారంగా ఫోజ్ ఇచ్చింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/