కథువా కేసులో ఆరుగురు దోషులు

తీర్పులో పఠాన్‌కోట్‌ కోర్టు వెల్లడి

kathua rape case
kathua rape case

పఠాన్‌కోట్‌: జమ్మూకాశ్మీర్‌లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్‌కోట్‌ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్‌, ఇద్దరు పోలీసు అధికారులు, హెడ్‌ కానిస్టేబుల్‌, మరో ఇద్దరు నిందితులను దోషులుగా కోర్టు తేల్చింది.
గతేడాది జనవరిలో జమ్మూకాశ్మీర్‌లోని కథువాకు చెందిన 8 ఏళ్ల చిన్నారిని అతి పాశవికంగా అత్యాచారం చేసి చంపిన విషయం విదితమే. కథువాలోని రసానా గ్రామానికి చెందిన ఈ చిన్నారి 2018 జనవరి 10న గుర్రాలు మేపడానికి వెల్లి అదృశ్యమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సరిగ్గా వారం తర్వాత అటవీప్రాంతంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం చేయగా ఆ రిపోర్టులో అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.
మొదట ఈ కేసును క్రైమ్‌ బ్రాంచీకి అప్పగించింది. ఐతే దర్యాప్తునకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు ఈ కేసును పఠాన్‌కోట్‌ కోర్టుకు బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది. మరికాసేపట్లో శిక్ష ఖరారుకానుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/