తమిళనాడులో కరుణానిధి నిలువెత్తు విగ్రహం

KARUNANIDHI
KARUNANIDHI

చెన్నై: డిఎంకె దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని చెన్నైలో వచ్చేనెల 16వ తేదీ ఆవిష్కరిస్తున్నట్లు పార్టీప్రకటించింది. డిఎంకె వ్యవస్థాపకుడు ముఖ్యమంత్రి సిఎన్‌ అన్నాదురై విగ్రహం సమీపంలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేస్తామని ప్రకటించింది. జాతీయ స్థాయి నాయకులు వివిధ రాజకీయ పార్టీలుసైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారని, డిఎంకె కరుణానిధి నిలువెత్తు విగ్రహం వచ్చేనెల 16వ తేదీ ఆవిష్కరిస్తామని పార్టీ వెల్లడించింది. అఖిలభారత నాయకుల ఆధ్వర్యంలో డా.కలైంజ్ఞార్‌ నిలువెత్తి విగ్రహం ఆవిష్కరణజరుగుతుందని వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీ కరుణానిధి పరమపదించిన సంగతి తెలిసిందే. 94వ ఏట కలైనార్‌ అస్వస్థతకు లోనై తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానులు, కార్యకర్తలు అందరూ ఆయన్ను కలైనార్‌గా పిలుచుకుంటారు.