కార్తికేయ 2 ట్రైలర్ చూసారా..?

కార్తికేయ 2 ట్రైలర్ వచ్చేసింది. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ , కలర్ స్వాతి జంటగా నటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా కథకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది. ఈసారి నిర్మాతలు కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా మూవీగా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి పైకి తీసుకువచ్చాడు. ఆగస్టు 13 న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఆసక్తి పెంచుతున్నారు.

ఈ క్రమంలో శనివారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ ఆసక్తి నింపారు. ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం.. పరిష్కారం లిఖితం’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ‘కార్తికేయ’ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అన్వేషించగా.. ఈ భాగంలో శ్రీకృష్ణ తత్వం నేపథ్యంలో మిస్టరీని ఛేదించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణుడి దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకోడానికి ద్వారక వెళ్లిన కార్తికేయ.. అక్కడి పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని తెలుసుకుంటాడు. ‘నా వరకు రానంతవరకే సమస్య.. నా వరకు వచ్చాక అది సమాధానం’ అంటూ అతను ఏదో మిస్టరీని ఛేదించడానికి బయలుదేరాడు. అతనితో పాటుగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ట్రావెల్ చేస్తుంది. మరి మిస్టరీ ఏంటి అనేది సినిమా చూస్తే అర్ధం అవుతుంది.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ – శ్రీనివాసరెడ్డి – ఆదిత్యా మీనన్ – వైవా హర్ష – తులసి తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కాల భైరవ సంగీతం సమకూర్చగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

YouTube video