మరోసారి కార్తికేయ 2 రిలీజ్ వాయిదా

నిఖిల్ , అనుపమ జంటగా తెరకెక్కిన కార్తికేయ 2 నాలుగోసారి కూడా వాయిదా పడింది. ఇప్పటికే మూడుసార్లు రిలీజ్ వాయిదా వేసుకున్న మేకర్స్..ఈ నెల 12 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంత అనుకుంటున్నా తరుణంలో మరోసారి వాయిదా వేసినట్లు తెలిపి నిరాశకు గురి చేసారు.

2014లో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ , కలర్ స్వాతి జంటగా నటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా కథకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది. ఈసారి నిర్మాతలు కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా మూవీగా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి పైకి తీసుకువచ్చాడు.

నిన్నటి వరకు ఆగస్టు 12 న వస్తుందని అనుకుంటుండగా..ఒక రోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13 న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలి కలెక్షన్స్ రావాలి కాబట్టి ఒక మంచి స్నేహం భావంతోనే ఈ సినిమాను ఒకరోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఆగస్టు 12 న నితిన్ నటించిన మాచర్ల నియోజవర్గం రిలీజ్ కాబోతుంది. అందుకే కార్తికేయ 2 న ఓ రోజు ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు.