కార్తికేయ 2 మూవీ టాక్ ..

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ ఈరోజు (ఆగస్టు 13) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ , కలర్ స్వాతి జంటగా నటించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా కథకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది. ఈసారి నిర్మాతలు కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా మూవీగా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి పైకి తీసుకువచ్చాడు.

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ చందూ మొండేటి ఎంతో సమయం తీసుకోలేదని , ఇంటర్వెల్ ట్విస్టుతో ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచారని అంటున్నారు. ఇక, సెకెండాఫ్ మాత్రం అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సీన్లతో నడిచిందని , క్లైమాక్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యిందని చెపుతున్నారు. స్టోరీ అంతా ఇంట్రెస్టింగ్‌ సాగుతుందని, థ్రిల్‌ ఫ్యాక్టర్‌ తక్కువగా ఉన్నప్పటికీ టీమ్‌ మొత్తం మంచి ప్రయత్నం చేశారని మరికొంతమంది అంటున్నారు. ఓవరాల్ గా సినిమా కు పాజిటివ్ టాక్ రావడం పట్ల అభిమానులు , చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు.