కార్తికేయ 2 సండే కలెక్షన్స్ చిత్రసీమకు షాక్ కు గురిచేశాయి

కార్తికేయ 2 కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. సినిమా విడుదలై 17 రోజులు అవుతున్న..బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం దూకుడు తగ్గడం లేదు. నిన్న సండే రోజు అన్ని సెంటర్ లలో భారీగా కలెక్షన్లు రాబట్టి చిత్రసీమను షాక్ లో పడేసింది. కథ బాగుంటే..నెల రోజులైనా సరే కలెక్షన్ల వర్షం కురావాల్సిందే అని మరోసారి కార్తికేయ 2 నిరూపించింది. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో నిఖిల్ , కలర్ స్వాతి జంటగా నటించారు.

మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమా కథకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది. ద్వారక బ్యాక్ డ్రాప్ లో ఒక సరికొత్త మిస్టరీని చాలా ఇంట్రెస్టింగ్ గా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి పైకి తీసుకువచ్చాడు. మొదటి రోజు మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడం , సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా లో సినిమా ఫై పాజిటివ్ గా స్పందిస్తుండడం తో థియేటర్స్ కు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. దీంతో కలెక్షన్ల సునామి నడుస్తుంది.

నిన్న 16 వ రోజు కలెక్షన్స్ చూస్తే..

నైజాంలో రూ. 72 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 10 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 10 లక్షలు, కృష్ణాలో రూ. 8 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రూ. 1.55 కోట్లు షేర్, రూ. 2.75 కోట్లు గ్రాస్ వసూలు అయ్యింది. దీంతో మొత్తం 16 రోజుల్లో చూస్తే..నైజాంలో రూ. 11.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.51 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.32 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.49 కోట్లు, గుంటూరులో రూ. 2.47 కోట్లు, కృష్ణాలో రూ. 2.00 కోట్లు, నెల్లూరులో రూ. 96 లక్షలతో.. రూ. 29.33 కోట్లు షేర్, రూ. 49.10 కోట్లు గ్రాస్ సాధించింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.55 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.55 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 11.35 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 16 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.78 కోట్లు షేర్‌, రూ. 97.40 కోట్లు గ్రాస్ వసూలైంది.