ఘనంగా గుంటూరు కలెక్టరేట్‌ ఉద్యోగుల కార్తీక వనసమారాధన

-హాజరైన కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

Guntur Collectorate Emp Staff in karteeka vanasamaradhana
Guntur Collectorate Emp Staff in karteeka vanasamaradhana

Guntur: కార్తీక వన సమారాధన వంటి మంచి సాంప్రదాయ కార్యక్రమాలు ద్వారాఉద్యోగుల్లో ఉండే రోజువారి ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అన్నారు. ఆదివారం మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలోని మామిడితోటలో కలెక్టరేట్‌ ఉద్యోగులు ఏర్పాటుచేసిన కార్తీక వనసమారాధన మహోత్సవంలో జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పాల్గొన్నారు..

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రోజువారి పనిఒత్తిడితో ఉన్న ఉద్యోగులకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆటవిడుపు ఉంటుందన్నారు. ఉద్యోగుల్లో వివిధ సాంస్కృతిక రంగాలపై ఉన్న టాలెంట్‌ను ప్రదర్శించటానికి ఉపయోగపడుతుందన్నారు.

కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనటం వంట మంచి అనుబంధం ఏర్పడుతందన్నారు. ఉద్యోగల ఒత్తిడి దూరం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలన్నారు.

Guntur District Collector Samuel Anand kumar, Jc Dinesh kumar in vana bojanaalu

కార్యక్రమంలో పాటలు, డాన్స్‌లు, వినోద కార్యక్రమాలు చేసిన ఉద్యోగులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.. కార్తీక వన సమారాధనను కలెక్టర్‌ కార్యాయంలో ఎఒ మల్లికార్జునరావు చక్కగా నిర్వహించారన్నారు.

కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్‌ కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సంయుక్త కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ, కలెక్టర్‌ కార్యాలయం ఉద్యోగులు కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటుచేశారన్నారు.

ఉద్యోగులు ప్రతిరోజు 80శాతం కార్యాలయపు విధుల్లోనే ఉంటారని, 20 శాతం మాత్రమే కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారని, ఇటువంటి కార్యక్రమాల ద్వారానే కుటుంబసభ్యులతో ఆనందంగా గడపటానికి వీలు ఉంటుందన్నారు.

ఉద్యోగుల్లో ఉన్న వివిధ రకాల కళలను ప్రదర్శించటానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చిన ఉద్యోగులుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.

Collectorate Employees staff in Vana bojanaalu

వనసమారాధన కార్యక్రమంలో కలెక్టరేట్‌ కార్యాలయంలోని ఉద్యోగులు ప్రదర్శించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, కెకె తరంగిణి ఈవెంట్స్‌ కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి.

వనసమారాధనలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, జెసి ఎఎస్‌ దినేష్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖరెడ్డి ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు

ఈసందర్భంగా నిర్వహించిన వినోద, ఆట, పాటల కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మేడికొండూరు తహశీల్దార్‌ కరుణకుమార్‌, రెవెన్యూ అసోసియేషన్‌ మహిళా కార్యదర్శి సుశీల, జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఉద్యోగులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/