భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కర్తార్‌పూర్‌ లొల్లి

DR Manmohan Singh
DR Manmohan Singh

ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌పై ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై అంతర్జాతీయంగా విమర్శలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం కోసం పాకిస్థాన్‌ పంపుతున్న ఆహ్వానాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత మాజీ ప్రధానిగా, సిక్కుల ప్రతినిధిగా ఆహ్వానించడానికి సిద్ధపడుతుండడం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కానీ, విదేశాంగ మంత్రి లేదా ఇతర మంత్రుల పేర్లను ఖురేషీ వెల్లడించలేదు. ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఆహ్వానం పట్ల మన్మోహన్‌సింగ్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ప్రధాని హోదాలో కంటే సిక్కుల ప్రతినిధిగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడానికే అధిక అవకాశాలున్నాయని తెలుస్తోంది.

భా రత్‌, పాకిస్థాన్‌ మధ్య కర్తార్‌పూర్‌ కారిడార్‌పై దౌత్యసంవాదం నెలకొంది. సిక్కుల పుణ్యక్షేత్రమైన కర్తార్‌పూర్‌ సాహిబ్‌కు రాదారిని నిర్మించాలని పాకిస్థాన్‌ ప్రభుత్వానికి భారతదేశం విజ్ఞప్తి చేసింది. సిక్కుల మత విశ్వాసాల వ్యవస్థాపకులు గురునానక్‌కు ఈ ప్రాంతం తుది మజిలీగా మారింది. ఈ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రాంతంలో ఉంది. ఇక్కడి గురునానక్‌ ఉత్సవాలకు భారత్‌ నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల నుంచి సిక్కులు వస్తుంటారు. ఈ క్షేత్రానికి చేరుకునేందుకు అనువైన రహదారిని నిర్మించారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య కీలకమైన కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం విషయంలో ఇమ్రాన్‌ఖాన్‌ వైఖరి వివాదాలకు కారణం అవ్ఞతోంది. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీని కాదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఆహ్వానించాలని ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించడమే అందుకు కారణం. గురునానక్‌ దేవ్‌ సమాధి నెలకొన్న దర్బార్‌ సాహిబ్‌ను కలుపుతూ భారత్‌, పాకిస్థాన్‌లు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. గురునానక్‌ దేవ్‌ 550వ జయంతి సందర్భంగా నవంబర్‌లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌370రద్దుతో భారత్‌పై విద్వేషం చిమ్ముతున్న పాకిస్థాన్‌ కాశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూనే ఉంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌పై ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై అంతర్జాతీయంగా విమర్శలు రేగడం ఖాయంగా కనిపిస్తోంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం కోసం పాకిస్థాన్‌ పంపుతున్న ఆహ్వానాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే భారత మాజీ ప్రధానిగా, సిక్కుల ప్రతినిధిగా ఆహ్వానించడానికి సిద్ధపడుతుండడం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కానీ, విదేశాంగ మంత్రి లేదా ఇతర మంత్రుల పేర్లను ఖురేషీ వెల్లడించలేదు. ప్రస్తుతం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఆహ్వానం పట్ల మన్మోహన్‌సింగ్‌ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ప్రధాని హోదాలో కంటే సిక్కుల ప్రతినిధిగా ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడానికే అధిక అవకాశా లున్నాయని తెలుస్తోంది. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ దేవ్‌ 550వ జయంతిని నవంబర్‌ 29న నిర్వహించనున్నారు. దేశంలోని అనేక గురుద్వారాల్లో వేడుకలకు సిక్కులు రెడీ అవ్ఞతున్నారు. మనదేశంలోనే కాకుండా పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి కూడా భక్తులు భారీ సంఖ్యలో వెళ్తారు. ఈ యాత్ర సాఫీగా సాగడానికి రెండు దేశాలూ వివిధ సదుపాయాలను కల్పించాల్సి ఉంది. వాటి గురించి చర్చించడానికి ఇండియా, పాకిస్థాన్‌ అధికారులు సమావేశమయ్యారు. మరోవైపు చారిత్రక గురుద్వార్‌ కర్తార్‌పూర్‌ సాహిబ్‌ను భారత సరిహద్దులోకి తెచ్చేందుకు పాకిస్థాన్‌ కొంత భూమిని అప్పగించాలని పంజాబ్‌ శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. రావి నది తీరంలోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ ఉన్న భాగాన్ని తీసుకొని దానికి బదులుగా పాకిస్థాన్‌కు 11వేల ఎకరాలు ఇవ్వాలనే ప్రతిపాదనను పంజాబ్‌ భారతప్రభుత్వానికి పంపించిం ది. పంజాబ్‌ మంత్రివర్గ సభ్యుడు, డేరా బాబానానక్‌ ఎమ్మెల్యే అయిన సుఖ్‌జిందర్‌ సింగ్‌ రణ్‌ధావా తమ నియోజకవర్గం నుంచి భూమిని ఇస్తామని ప్రకటించారు. రావి నది ఒడ్డున ఉన్న కర్తార్‌పూర్‌లో గురునానక్‌ దేవ్‌ నిర్మించిన గురుద్వార్‌ సిక్కులకు పవిత్ర ప్రదేశం. దేశ విభజన వల్ల పాకిస్థాన్‌ పరిధిలోకి వెళ్లిపోయిన ఆ సాహిబ్‌ మనదేశంలో పంజాబ్‌రాష్ట్రం గురుదాస్‌పూర్‌ జిల్లాలోని డేరాబాబా నానక్‌ నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలోఉంది.భారత్‌, పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్లు వెళితే ఈ మందిరం కనిపిస్తుంది. ఈ మార్గంలో కారిడార్‌ నిర్మాణానికి గత ఏడాది నవంబర్‌ 26న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. రెండు రోజుల తర్వాత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శ్రీకారం చుట్టారు. ఈ కారిడార్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వివిధ దేశాల భక్తులు గురుద్వార్‌కు బస్సుల్లో వెళ్లేటప్పుడు పాకిస్థాన్‌ రేంజర్లు ఆర్మీకాన్వా§్‌ుతో ఫుల్‌ సెక్యూరిటీ కల్పిస్తారు. దేశ విభజన వల్ల 1947లో భారతీయులు ఈ ప్రదేశానికి రాకుండా పాకిస్థాన్‌ ప్రభుత్వం రోడ్డు మూసివేసింది. దీంతో సరిహద్దు వద్దకు వెళ్లి టెలిస్కోప్‌తో చూడాల్సివచ్చేది. మరమ్మతులు, పునరుద్ధరణతర్వాత గురుద్వార్‌ను1999లో తిరిగి ప్రారంభించారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి నాయక త్వంలో లాహోర్‌కి బస్సు యాత్ర జరిగింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య రోడ్డు, రైలు సదుపాయాలు వచ్చాయి. వీసాతో పాక్‌లోకి ప్రవేశించినవాళ్లు కర్తార్‌పూర్‌ గురుద్వార్‌ సాహిబ్‌ సందర్శనకు వెళ్లటానికి ఎలాంటి ఆటంకాలూ ఉండేవి కాదు. కర్తార్‌పూర్‌ సరిహద్దు క్రాసింగ్‌ని ప్రారంభం చేయాలనే అంశం తొలిసారి 1998లో రెండుదేశాల మధ్య చర్చకువచ్చింది. 1999లో బస్సు దౌత్యం అనంతరం జరిగిన సంప్రదింపుల తర్వాత కర్తార్‌ పూర్‌ సాహిబ్‌ గురుద్వార్‌కు పాకిస్థాన్‌ మార్పులు చేసింది. ఇండియా సరిహద్దు వద్ద నుంచి చూడటానికి కూడా అనుమతిం చింది. ఇండియా నుంచి సిక్కులు కర్తార్‌పూర్‌ గురుద్వార్‌ సందర్శ నకు ఏటా ముఖ్యంగా నాలుగుసార్లు వెళుతుంటారు. ఒకటి బైశాఖి పండగ సందర్భంగా, రెండు సిక్కుల ఐదో గురువ్ఞ అర్జున్‌ దేవ్‌ అమరుడైన రోజు. మూడు మహారాజా రంజిత్‌సింగ్‌ వర్ధంతి నాడు. నాలుగు గురునానక్‌ దేవ్‌ జయంతి రోజు. ఈ నాలుగు సందర్భాల్లో మనదేశ భక్తులు పాకిస్థాన్‌లోని అన్ని గురుద్వారాల కూ వెళ్లేందుకు నేరుగా ప్రవేశించేందుకు వీలు ఉంటుంది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే మనోళ్లకు పాస్‌పోర్టులు, వీసాలు లేకుండానే యాత్రలో పాల్గొనేందుకు వీలుంటుంది.

  • ప్రభు పులవర్తి
    ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు
    తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/editorial/