కర్ణాటక జట్టు అరుదైన రికార్డు

rohan kadam
rohan kadam

విశాఖపట్నం: కర్ణాటక రాష్ట్రం జట్టు భారత్‌ క్రికెట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పింది. వరుసగా 15 టి20లు గెలిచి చరిత్ర సృష్టించింది. సయద్‌ ముస్తక్‌ అలీ ట్రోఫీలో గ్రూప్‌ ఏ విభాగంలో కర్ణాటక, ఉత్తరాఖండ్‌ జట్లు టీ20 మ్యాచ్‌ ఆడాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన ఉత్తరాఖండ్‌ 113 పరుగులు చేయగా, కెప్టెన్‌ తన్మ§్‌ు శ్రీవాస్తవ 39 పరుగులతో టాప్స స్కోరర్‌గా నిలిచాడు. కర్ణాటక 15.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అంతేకాక మనదేశంలో అత్యధిక టీ2లు గెలిచిన జట్టుగా కర్ణాటక నిలబడడం మాత్రమే కాక ప్రపంచ క్రికెట్‌ జాబితాలో రెండోస్థానానికి చేరుకోవడం విశేషం.
తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/