బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

కర్ణాటకలోని బీదర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో రిక్షా ఢీ కొట్టుకొవడంతో ఏడుగురు మహిళలు అక్కడిక్కక్కడే మృతి చెందారు. మరణించిన మహిళలంతా కార్మికులని, వారు పనిప్రదేశం నుంచి ఇంటికి ఆటోలో తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ట్రక్కు బేమలఖేడ ప్రభుత్వ పాఠశాల వద్ద ఢీకొట్టింది.

మరణించిన వారిలో పార్వతి(40), ప్రభావతి (36), గుండమ్మ(60), యాదమ్మ (40), జగ్గమ్మ(34),ఈశ్వరమ్మ(55), రుక్మిణీబాయి(60)లుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. వీరంతా బుడమనహళ్లి గ్రామానికి చెందిన కూలీలు. పని ముగించుకుని తమ ఇండ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.