గుండెపోటుతో మంత్రి మృతి

shivalli
shivalli, karnataka mmnister


బెంగళూరు: కర్ణాటక మున్సిపల్‌ శాఖ మంత్రి సిఎస్‌ శివల్లి గుండెపోటుతో మృతిచెందారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ధార్వాడ్‌లో కొంతమంది ప్రజలతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలారు. చికిత్స పొందుతూనే ఆయన కన్నుమూశారు. ధార్వాడ్‌ జిల్లాలోని కుండగోల్‌ నియోజకవర్గం నుంచి చిన్నబసప్ప సత్యప్ప శివల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గత మూడు రోజులుగా ధార్వాడ్‌లో భవనం కూలిన ప్రాంతంలో చేపట్టిన సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.