ఒకే త‌ల్లి బిడ్డ‌లుగా హిందువులు, ముస్లింలు క‌లిసి వుండాలి

శాంతియుతంగా, స‌గ‌ర్వంగా బ‌తికే విధంగా ఉండాలి

బెంగళూరు: క‌ర్నాట‌క‌ మాజీ ముఖ్య‌మంత్రి, బీజేపీ అగ్ర‌నేత య‌డియూర‌ప్ప ఆ రాష్ట్రములో జ‌రుగుతున్న సంప్ర‌దాయ‌క ఘ‌ర్ష‌ణ‌ల‌పై కీలక వ్యాఖ్య‌లు చేశారు. ముస్లింలు శాంతియుతంగా, స‌గ‌ర్వంగా బ‌తికే విధంగా ఉండాల‌ని, అలాంటి ప‌రిస్థితులు క‌ల్పించాల‌ని వ్యాఖ్యానించారు. ఒకే త‌ల్లి బిడ్డ‌లుగా హిందువులు- ముస్లింలు క‌లిసి వుండాల‌న్న‌దే త‌న అభిమత‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి స‌మ‌యంలో ఎవ‌రైనా ఇబ్బందులు సృష్టిస్తే, వారికి త‌గిన శిక్ష‌లు ప‌డ‌తాయ‌ని కూడా ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

ఇప్ప‌టికైనా ఇలాంటి మ‌త ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని, అంద‌రూ క‌లిసి ఐక‌మ‌త్యంగా ఉండాల‌ని య‌డియూర‌ప్ప పిలుపునిచ్చారు. క‌ర్నాట‌క‌లోని దేవాల‌యాల వ‌ద్ద ముస్లిం దుకాణాలు ఉండ‌కూడ‌ద‌ని, హ‌లాల్‌ను బ‌హిష్క‌రించాల‌ని, పండ్ల వ్యాపారంలో ముస్లిం గుత్తాధిప‌త్యాన్ని ర‌ద్దు చేయాలంటూ హిందుత్వ సంఘాలు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/