కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి కరోనా

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఎం కర్జోల్ కి కరోనా సోకింది. లక్షణాలు లేనప్పటికీ.. వైద్యుల సలహా మేరకు హాస్పిటల్లో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేసుకోవడంతో పాటు నిర్బంధంలో ఉండాలని సూచించారు. కాగా కర్ణాటకలో ఇప్పటి వరకు 5,26,876 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 95,335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,23,377 డిశ్చార్జి కేసులుండగా, వైరస్ ప్రభావంతో 8145 మంది మృత్యువాతపడ్డారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/