రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం!

కర్ణాటక తర్వాత బిజెపి టార్గెట్‌ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్లపైనే!

mamata banarjee
mamata banarjee, west bengal CM

బెంగళూరు: కన్నడనాట రాజకీయ పరిస్థితులపై పశ్చిమ బెంగాల్‌ సియం మమతా బెనర్జీ స్పందించారు. కర్ణాటకలో ప్రస్తుత సంక్షోభానికి బిజెపి కారణమంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాజ్యాంగం ఇప్పుడు ప్రమాదంలో పడిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉందన్నారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బంధించారని, వారున్న పరిసరాల్లోకి కొన్ని మీడియా సంస్థలను కూడా రానివ్వకుండా వారితో రహస్య మంతనాలు జరుపుతున్నారని, దీని వెనుక బిజెపి హస్తం ఉంటుందని ఆమె అన్నారు. ఇలా కొనసాగితే ప్రజాస్వామ్యం తన ఉనికిని కోల్పోయి, రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అన్నారు. ప్రజాస్వామాన్ని బిజెపి నుంచి కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలి, దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలనే దురుద్దేశంతో ఉన్న బిజెపికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ఆ పార్టీ వారివి చెత్త రాజకీయాలు, కర్ణాటక తర్వాత వారి టార్గెట్‌ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లే. ప్రభుత్వాల్ని కూలదోయడమే వారి పనిగా పెట్టుకున్నారు అంటూ తీవ్రంగా స్పందించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/