అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్న కాంగ్రెస్‌, జేడిఎస్‌లు

leaders
leaders

బెంగళూరు: అసమ్మతి సెగతో సతమతమవుతున్న కర్ణాటక రాజకీయి సంక్షోభం బలపరీక్షదాకా వెళ్లింది. సభలో తన బలానిన నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్వయంగా సియం కుమారస్వామి ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే అసంతృప్త ఎమ్మెల్యేలు సంకీర్ణానికి ఓటేయాల్సిన పరిస్థితి. దీంతో వారిని బుజ్జగించే పనిలో పడ్డారు కాంగ్రెస్‌, జేడిఎస్‌ నేతలు. శనివారం తెల్లవారుఝామున కాంగ్రెస్‌ మంత్రి డీకె శివకుమార్‌, అసంతృప్త ఎమ్మెల్యే ఎంటిబి నాగరాజ్‌ ఇంటికి వెళ్లారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని ఆయనను కోరినట్లు తెలుస్తుంది. అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబై నుంచి బెంగళూరుకు రావాలని కోరినట్లు సమాచారం. మరోవైపు బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించింది. బిజెపి కూడా తమ శాసనసభ్యులను విధాన సభ నుంచే నాలుగు బృందాలుగా రిసార్టులకు తరలించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/