నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ

Yeddyurappa
Yeddyurappa

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్ప మంగళవారం ఉదయం 10.30 -11.30 గంటల మధ్యలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశాను. అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయమని ప్రధాన కార్యదర్శికి చెప్పాను. విస్తరణ తర్వాత కేబినెట్ సమావేశం ఉంటుంది అని యెడ్యూరప్ప విలేకరులకు చెప్పారు. ఇప్పటికి 20 రోజులుగా ఒక్క వ్యక్తితోనే ప్రభుత్వం నడుస్తోంది. ఆగస్ట్ 20న మంత్రివర్గాన్ని ఏర్పరిచేందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యెడ్యూరప్ప జూలై 29న కర్ణాటక అసెంబ్లీలో తన ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకున్నారు. అయితే ఇంతవరకూ ఎవరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఖమంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలో పార్టీ అధిష్ఠానం స్పష్టంగా ఆదేశిస్తుంది. అమిత్‌షాతోనూ, ఇతర నాయకులతోనూ నేను చర్చించాను.13 నుంచి 14 మందివరకు మంత్రివర్గంలో ఉంటారు. అయితే ఒకరిద్దరు తక్కువా కావచ్చు లేదా ఎక్కువా కావచ్చుగ అని యెడ్యూరప్ప ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చెప్పారు. ఇంతవరకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంపై సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితి రాష్ట్రపతి పాలనను తలపిస్తోందిగ అని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిhttps://www.vaartha.com/news/movies/

: