నేడు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు

YEDDYRAPPA
YEDDYRAPPA

బెంగళూరు: దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. దీంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బిజెపిదే విజయమని చెప్పినప్పటికీ నేతల్లో మాత్రం టెన్షన్ పోవడం లేదు. ముఖ్యంగా బిజెపికి ఈ ఎన్నికలు ఎంతో కీలకం. ఆ పార్టీ కనీసం ఆరు సీట్లు గెలుచుకుంటేనే ప్రభుత్వం సేఫ్‌గా ఉంటుంది. లేదంటే మైనారిటీలో పడిపోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప ధర్మస్థలిలోని  మంజునాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ షిర్డీ వెళ్లి సాయినాథుడిని దర్శించుకున్నారు.