లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్యే కొడుకు

ఇంట్లో భారీగా దొరికిన నగదు..రూ.6 కోట్లు స్వాధీనం

karnataka-bjp-mla-virupakshappa-son-arrested-after-rs-6-crore-cash-recovered-from-home

తిరువనంతపురం: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే బిజెపికి షాక్ కలిగించే ఘటన చోటుచేసుకుంది. బిజెపి ఎమ్మెల్యే కుమారుడు రూ.40లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. చెన్నగిరి బిజెపి ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్‌ తన తండ్రి కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇక తాజాగా ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా రూ.6 కోట్లు దొరికాయి. అంతకుముందు ప్రశాంక్ మదల్ టేబుల్‌పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాంతో పాటు ఆయన కార్యాలయం నుంచి రూ.1.7 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. సబ్బులు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడిసరుకు డీల్‌ ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ నుంచి ప్రశాంత్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు తెలుస్తోంది.