రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలి..అభివృద్ధికి నిదర్శనమన్న కేటీఆర్

బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమన్న కేటీఆర్

హైదరాబాద్: కర్ణాటకలోని రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని కోరుతుండడం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాయచూర్‌ను తెలంగాణలో కలపాలంటూ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఓ నెటిజన్ కేటీఆర్‌కు పంపారు.

దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమని ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే కోరికను అక్కడి ప్రజలు సైతం కరతాళ ధ్వనులతో స్వాగతించారని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్రలోని నాందేడ్ నాయకులు కూడా ఇలాంటి డిమాండే చేసినట్టు ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/