టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీలను ఆవిష్కరించిన కరీనా కపూర్‌…

KAREENA KAPOOR
KAREENA KAPOOR

మెల్‌బోర్న్‌: బాలీవుడ్‌ నటి,పటౌడీ వంశం కోడలు కరీనా కపూర్‌ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల, మహిళల ఐసిసి టీ20 ప్రంచకప్‌ ట్రోఫీలను ఆమె శుక్రవారం మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ట్రోఫీ ఆవిష్కరణ తర్వాత కరీనా కపూర్‌ ఖాన్‌ స్టేడియంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంలో గ్యాలరీలో కూర్చొని, స్టేడియం లోపక సచిన్‌ ఫోటో పక్కనే ఫోజులిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే ఆయా దేశాల తరపున ఆడుతోన్న మహిళా క్రికెటర్లంతా తమ కలలను సాకారం చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు. ఇంతటి అంత్జాతీయ టోర్నీలో వారు పాల్గొనడం గొప్ప విషయమని, వారంతా మనకు ఆదర్శనమని కరీనా కపూర్‌ కొనియాడారు. తన మామగారు (మన్సూర్‌ పటౌడీ అలీఖాన్‌) కూడా ప్రముఖ క్రికెటర్‌ అని ఈ సందర్భంగా కరీనా గుర్తు చేశారు.