బాలీవుడ్‌ నిర్మాత స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం

karan johar
karan johar


బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌కు చెందిన స్టూడియోలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు చెబుతున్నారు. కొన్నేళ్లుగా ధర్మ ప్రొడక్షన్స్‌కి సంబంధించిన జ్ఞాపకాలు, విలువైన సంపద, వెల కట్టలేని వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయట. దీంతో కరణ్‌ జోహార్‌ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది.
సెట్స్‌పై ఉన్న సినిమాలు, తదుపరి సినిమాలకి సంబంధించిన ప్రాపర్టీలు, స్క్రిప్టులు, విలువైన వస్తువులు కూడా మంటల్లో కాలిపోయాయని సమాచారం. కాస్టూమ్స్‌, సినిమా సెట్టింగ్‌లకు వినియోగించే వస్తువులు అగ్నికి ఆహుతి కావడాన్ని సంస్థ నిర్వాహకులు జీర్ణించుకోలేక పోతున్నారట. కోట్లలోనే ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తెల్లవారుఝామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/