కాంతారా (తెలుగు) ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఎలాంటి పబ్లిసిటీ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన మూవీ కాంతారా. కేవలం మౌత్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు కానీ సినిమా గురించి కానీ ఎవ్వరికి పెద్దగా తెలియదు. ముందుగా కన్నడలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఆ తర్వాత తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో విడుదలై , బాక్స్ ఆఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉందని , ఈ సినిమా ముందు ఏ బాహుబలి , కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ కూడా పనికిరాదని చెపుతున్నారు. ఇదిలా ఉంటె ఈ మూవీ తెలుగు లో భ్రహ్మాండమైన కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వారానికి గాను ఈ మూవీ రెండు రాష్ట్రాల్లో రూ. 11.37 కోట్లు షేర్, రూ. 21.15 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.

ఏరియా వైజ్ చూస్తే..

నైజాంలో రూ. 5.00 కోట్లు
సీడెడ్‌లో రూ. 1.47 కోట్లు
ఉత్తరాంధ్రలో రూ. 1.49 కోట్లు
ఈస్ట్ గోదావరిలో రూ. 93 లక్షలు
వెస్ట్ గోదావరిలో రూ. 59 లక్షలు
గుంటూరులో రూ. 73 లక్షలు
కృష్ణాలో రూ. 70 లక్షలు
నెల్లూరులో రూ. 46 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 11.37 కోట్లు షేర్, రూ. 21.15 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టింది.