అవినీతిరహిత పాలనే బిజెపి ప్రధాన లక్ష్యం: కన్నా

KANNA
KANNA

అవినీతిరహిత పాలనే బిజెపి ప్రధాన లక్ష్యం: కన్నా

విజయవాడ: అవినీతి రహిత పాలన, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో మోర్చా జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బాజికి సన్మాన కార్యక్రమం ఆదివారం విజయవాడ ఐవి పాలెస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాపాల్గొన్న కన్నా మాట్లాడుతూ 1991లో బిజెపి సిద్దాంతంపట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన షేక్‌బాజీ, కృషి, క్రమశిక్షణలతో పనిచేసి పార్టీలో పలు బాద్యతలు నిర్వహించారన్నారు. నిస్వా ర్ధంగా పనిచేసేవారికి పార్టీలో మంచిస్థానం లభి స్తుందన్నారు. ఇందుకు ప్రస్తుత ప్రధాని మోడీ ఉదాహరణ అన్నారు. కేంద్రం నుండి మోడీ నిధులిస్తుంటే రాష్ట్ర పాలకులు ఆ నిధులను అవి నీతికి పాల్పడి స్వాహా చేస్తూ నిదులివ్వడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. పోలవరంకు 100శాతం నిధులిస్తే అందులోనూ అవినీతి చేశారన్నారు. చంద్రబాబు 1500 రోజులపాలనలో ఏ హామీలు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2019లో బిజెపికి పట్టంగడితే అవినీతి రహిత అభివృద్దిని అందిస్తూ రాష్ట్రాన్ని పాలిస్తామన్నారు. షేక్‌బాజీ మాట్లాడుతూ బిజెపి కార్యకర్తగా తాను నిరం తరం గర్విస్తున్నానన్నారు. తనను నమ్మి పదవి అప్పగించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.