సీఎం జగన్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగ లేఖ

జీతాలు రాకపోవడంతో వెయిటింగ్‌ లిస్టులో ఉన్న ఇబ్బందులు పడుతున్నారు

kanna lakshminarayana
kanna lakshminarayana

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయిటింగ్‌లో ఉన్న ఉద్యోగులకు, పోలీసులకు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 80 మంది డీఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు, 150 మంది ఎస్‌ఐలు, 120 మంది సీఐలకు పోస్టింగులు ఇవ్వాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. జీతాలు రాకపోవడంతో వెయిటింగ్‌లో ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారని కన్నా విచారం వ్యక్తం చేశారు. ఇంత మంది విధులకు దూరంగా ఉంచడం శాంతిభద్రతలకూ ఇబ్బందేనన్నారు. ఇలాంటి వాతావరణం వల్ల ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కన్నా లక్ష్మీనారయణ ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/