భిన్నత్వంలో ఏకత్వం నిరూపించాల్సిన సమయం

kanna lakshminarayana
kanna lakshminarayana

అమరావతి: రామ జన్మభూమిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎపి బిజిపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ అన్నారు. సుప్రీం కోర్టు అందరికి ఆమోదయోగ్యమైన తీర్పు ఇచ్చిందన్నారు. సత్యమేవ జయతే అంటూ ట్విట్టర్‌లో ఈ విధంగా స్పందించారు. శతాబ్దాల సమస్యకు పరిష్కారం లభించింది. దశాబ్దాల వాదోపవాదాల విన్న తర్వాత, సాక్ష్యాల పరిశీలన తర్వాత, సత్యశోధన తర్వాత సుప్రీంకోర్టు న్యాయస్థానం ఆమోదయోగ్యమైన తీర్పు వెలువరించింది. ఇది జయాపజయాలకు విషయం కాదని దేశ ప్రజలందరూ ఒక్కటే అని భిన్నత్వంలో ఏకత్వం అని నిరూపించాల్సిన సమయం అని ట్వీట్‌ చేశారు. ఈ తీర్పుతో దశబ్దాల వివాదానికి మంచి ముగింపు లభించిందన్నారు. గతాన్ని మర్చిపోదామని అందరు శాంతి స్థాపనకు కృషి చేయాలని అన్నారు.
తాజా క్రీడ వార్తకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/