నా భూమిపై కబ్జాసురుల కన్ను పడింది

విశాఖలో భూమాఫియాకు వందలమంది బలయ్యారన్న కన్నా

kanna laxminarayana
kanna laxminarayana

అమరావతి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన భూమిపైనా కబ్జాసురుల కన్ను పడిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. భీమిలి సమీపంలో ఉన్న తన భూమిని కొట్టేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. 1993లో చేపలుప్పాడలో స్థలం కొన్నానని, తన స్థలం పక్కనే ఓ పోలీసు అధికారం స్థలం కూడా ఉందని, ఆ రెండు స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ విషయం తెలిసిన పోలీసు అధికారి తనకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యానని కన్నా వివరించారు. ఇదేంటని కబ్జాదారులను ప్రశ్నిస్తే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి స్థలం అనుకోలేదని చెప్పారని వెల్లడించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/