ప్రజలు టీడీపీ-జనసేన పొత్తును కోరుకుంటున్నారు – కన్నా

టీడీపీ పార్టీ లో చేరిన బిజెపి మాజీ నేత కన్నా లక్ష్మీనారాయణ..ఏపీ ప్రజలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తును కోరుకుంటున్నారని తెలిపారు. బిజెపి పార్టీ బయటకు మాత్రమే జనసేన తో పొత్తు అని చెపుతుంది కానీ లోపల పొత్తు అనేది లేదని అంటున్నారని కన్నా చెప్పుకొచ్చారు. భీమవరం డిక్లరేషన్‌లోనూ జనసేన పేరు ప్రస్తావించలేదని కన్నా గుర్తు చేశారు.

రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పడాలన్నా, రాజధానిగా అమరావతి అభివృద్ధి జరగాలన్నా అది టీడీపీతోనే సాధ్యమని, అందుకనే ఆ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఇప్పుడు వైస్సార్సీపీ లో ఉన్న వారు కూడా మనసు చంపుకుని నియంత వద్ద కొనసాగుతున్నారని తెలిపారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టు కన్నా అన్నారు. చంద్రబాబు, పవన్ కూర్చుని మాట్లాడుకుని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరారు. .

ఇక గురువారం కన్నా టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరారు. ఈయన తో పాటు ఆయన కుమారుడు, గుంటూరు మాజీ మేయర్ నాగరాజు కూడా టీడీపీలో చేరారు. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు 3 వేల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.