రేపు రాజధానిలో దీక్ష చేపట్టనున్న కన్నా

AP BJP Chief Kanna Lakshminarayana
AP BJP Chief Kanna Lakshminarayana

అమరావతి: ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ శుక్రవారం మౌన దీక్షకు దిగనున్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన చోట కన్నా దీక్ష చేపట్టనున్నారు. ఆయనతో పాటు బిజెపి శ్రేణులు కూడా దీక్షలో పాల్గొనున్నారు. శుక్రవారం ఉదయం 8.30గంటలకు దీక్ష ప్రారంభం కానుంది. కాగా,ఏపీ రాజధానిని ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. రాజధానిని తరలించడమంటే జగన్‌ అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకోవడమేనని కన్నా ఇటీవల విమర్శించారు. జగన్‌కు అనుభవరాహిత్యంతో పాటు అవగాహన రాహిత్యం ఉందన్నారు. సాక్షాత్తూ ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన రాజధానిని మరో చోటుకు తరలించడం అవివేకం అన్నారు. ఇది కేవలం అమరావతి రైతుల సమస్య కాదని, రాష్ట్ర సమస్య అని స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/