కూలిన చ‌క్కి రైల్వే బ్రిడ్జ్‌..14 మంది మృతి

Kangra’s Chakki bridge collapses amid heavy rainfall in HP

సిమ్లాః భారీ వర్షాల కారణంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కంగ్రా జిల్లాలో ఉన్న చ‌క్కి బ్రిడ్జ్ ఈరోజు కూలింది. శ‌నివారం ఆ బ్రిడ్జ్ కూలినట్లు జిల్లా మెజిస్ట్రేట్ రోహిత్ రాథోడ్ తెలిపారు. మండి జిల్లాలో కూడా ఇవాళ ఉద‌యం అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం, వ‌ర‌ద వ‌చ్చింది. అయితే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో 14 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. చంబా జిల్లాలో వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగి ఓ ఇంటిపై ప‌డ్డాయి. ఆ ఘ‌ట‌న‌లో ముగ్గురు మ‌ర‌ణించారు.

మండి జిల్లాలోని బాగీ నుల్లాలో ఓ అమ్మాయి మృత‌దేహన్ని ఇంటికి అర‌కిలోమీట‌రు దూరంలో గుర్తించారు. ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన అయిదుగురు వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయిన‌ట్లు డిజాస్ట‌ర్ మేనేజ్మెంట్ శాఖ అధికారులు తెలిపారు. క్లౌడ్‌బ‌స్ట్ కావ‌డంతో బాగీ నుంచి ఓల్డ్ క‌టోలా ప్రాంతంలో ఉన్న ఇండ్ల‌కు చెందిన కుటుంబాలు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాయి. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల మండి జిల్లాలో రోడ్ల‌న్నీ బ్లాక్ అయ్యాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/