దాదాసాహెబ్ పాల్కే అవార్డులపై కంగనా ఫైర్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన నోటిపనిచెప్పింది. నిత్యం విమర్శలు , కౌంటర్లు వేస్తూ వార్తల్లో నిలిచే ఈ భామ..తాజాగా ప్రకటించిన దాదాసాహెబ్ పాల్కే అవార్డులపై విమర్శలు చేసింది. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్‌ ఫాల్కే వేడుక సోమవారం రాత్రి ముంబైలో అట్టహాసంగా జరిగింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఫిలిం ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు దక్కించుకుంది. అలాగే కన్నడ చిత్రసీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న కాంతార సినిమాకు కూడా అవార్డు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ అవార్డును రిషబ్‌ శెట్టి దక్కించుకున్నాడు. ఇక ఉత్తమ చిత్రంగా ది కశ్మీర్‌ ఫైల్స్‌ , ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ ( బ్రహ్మస్త్ర 1), ఉత్తమ నటిగా ఆలియాభట్‌ (గంగూబాయి కథియావాడీ) అవార్డు సొంతం చేసుకున్నారు. కాగా రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌ లకు అవార్డ్స్ దక్కడం పట్ల కంగనా ఫైర్ అయ్యింది.

అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించింది. నెపోటిజం వల్లే అలియా భట్.. రణబీర్ కపూర్ కు అవార్డులు వచ్చాయని విమర్శించారు. బాలీవుడ్ లో నెపో మాఫియా కారణంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఇక్కడ అర్హులకు అవార్డులు రావడం లదేని..అలాగే అవకాశాలు కూడా అందకూండా చేస్తున్నారని ఆరోపించింది.

బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకే అన్ని దక్కుతున్నాయని ..ఇది ఎంతో దారుణమన్నారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకునే అర్హత వీరికే ఉందంటూ కంగన స్వయంగా ఓ జాబితా తయారు చేసి ట్విటర్లో విడుదల చేసింది. బెస్ట్ యాక్టర్ అవార్డు కన్నడ నటుడు రిషబ్ శెట్టికి ‘కాంతార’ సినిమాకు ఇవ్వాలన్నారు. అలాగే ఉత్త మ నటి అవార్డు మృణాల్ ఠాకూరుకు ‘సీతారామం’కు గాను ప్రకటించాలన్నారు. ఉత్తమ చిత్రం అవార్డు కూడా ‘కాంతార’కే రావాలన్నారు. ఇక ఉత్తమ దర్శకుడిగా ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి గాను ఎస్ ఎస్ రాజమౌళికి ఇవ్వాలన్నారు.

అలాగే ఉత్తమ సహాయ నటుడిగా ‘కశ్మీర్ ఫైల్స్’ లో నటించిన అనుపమ్ ఖేర్ కి రావాలి. ఉత్తమ సహాయ నటిగా టబుని ‘భూల్ భులయ్యా-2’కి గాను ఎంపిక చేయాలని తన జాబితాను విడుదల చేసింది. కంగనా విడుదల చేసిన జాబితా కు అంత మద్దతు ఇస్తున్నారు.