మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కన్నుమూత
kandula-sivananda-reddy

కడప: మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూశారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కందుల 1989లో కాంగ్రెస్ తరపున కడప ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టిడిపిలో చేరారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బిజెపిలో చేరారు. వ్యాపారవేత్తగా ఏపిలో కందుల శివానందరెడ్డికి గుర్తింపు ఉంది. కందుల గ్రూప్స్ పేరుతో ఆయనకు పలు విద్యా సంస్థలు ఉన్నాయి. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ప్రత్యర్థిగా కందులకు గుర్తింపు ఉంది. కాలక్రమంలో రాజకీయంగా ఆయన సైలెంట్ అయిపోయారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/