పాఠశాలల్లో ఏం నేర్పుతున్నారు

ఉపాధ్యాయులపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

Harish Rao
Harish Rao

సంగారెడ్డి: జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటించి, ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో కందిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. పదవ తరగతి విద్యార్థులకు తెలుగులో సరిగా రాయలేకపోవడం, ఎక్కాలు చెప్పలేకపోవడంతో ఉపాధ్యాయులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదో ఎక్కం సరిగా రాకపోతే విద్యార్థులు పరీక్షల్లో ఎలా పాసవుతారని అన్నారు. ఈ పోటీ ప్రపంచంతో ఎలా పోటీ పడతారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కంది శివారులో నూతనంగా నిర్మిస్తున్న టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/