సరస్వతీదేవిగా బెజవాడ కనకదుర్గమ్మ

సకల జ్ఞానానికి సరస్వతీ మాత చిహ్నం

Kanakadurga who appeared as Goddess Saraswati

విజయవాడ: రాష్ట్రంల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగా జరుగుతున్నాయి. మూలానక్షత్రం రోజున అమ్మవారి అభయం పొందేందుకు భక్తులు బెజవాడ కనకదుర్గడికి పోటేత్తుతున్నారు. ఆశ్వయుజ శుద్ధపంచమి అయిన ఈరోజు అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.

సకల విద్యలకు, కళలకు, సకల జ్ఞానానికి సరస్వతీ మాత చిహ్నం. హంసవాహినిగా, వీణాపాణిగా కొలుస్తుంటారు. విద్యార్థిని, విద్యార్థులకు సరస్వతి అమ్మవారంటే అమితమైన ఇష్టం. అమ్మవారి అనుగ్రహం కోరుతున్న వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను సరస్వతీ దేవి ప్రసాదిస్తుంది.

మూలా నక్షత్రం నాటి నుంచి విజయదశమి విశేష పర్వదినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయినీ సరస్వతీదేవి. భక్తులు తరలివచ్చిన అమ్మవారిని దర్శించుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/