కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
విజయవాడకు మరో మణిహారం

Vijayawada: రానున్న అయిదేళ్లలో రోడ్లు నిర్మాణం అభివృద్ధికి మరో రూ.15వేల కోట్లు ఖర్చుపెట్టేందకు కేంద్రం అంగీకరించిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎం. శంకరనారాయణ అన్నారు.
వర్చువల్ విధానంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి , నాగపూర్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతులమీదుగా శుక్రవారం విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌తోపాటు , బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభం అయ్యాయి..



అనంతరం భవానీపురం బస్టాప్ వద్ద రిబ్బన్‌కట్ చేసి దుర్గ ఫ్లైఓవర్‌పై రాకపోకలను మంత్రి శంకర నారాయణ ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు ఫ్లైఓవర్‌పై ప్రయాణించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బ్రాహ్మణపరిషత్ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు జోగిరమేష్, కె.రక్షణ నిధి, దూలం నాగేశ్వరరావు, నగర సిపి బి.శ్రీనివాసులు, విఎంసి కమిషనర్ వి.ప్రసన్నవెంకటేష్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ (క్వాలిటీ) జాన్ మోషే, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాసరావు,వైకాపా నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/