దుర్గమ్మతల్లీ..కలకాలం కాపాడుతల్లీ..

బిడ్జిపై సాష్టాంగ నమస్కారాలతో మొక్కిన భక్తురాలు.. మరోవైపు ఫ్లైఓవర్‌పై సెల్ఫీలతో సందడి

దుర్గమ్మతల్లీ..కలకాలం కాపాడుతల్లీ..
Devotee on durga flyover

దుర్గమ్మతల్లీ కలకాలం కాపాడుతల్లీ.. అంటూ దుర్గ ఫ్లైఓవర్‌ కొత్త బ్రిడ్జిపై ఒక మహిళ మొక్కుకుంది..

శుక్రవారం ప్రారంభమైన ఫ్లైఓవర్‌పై కృష్ణలంకకు చెంది ఎన్నా తిరుపతమ్మ బ్రిడ్జిపై సాష్టాంగ నమస్కారాలతో బ్రిడ్జికి దండాలు పెడుతూ తన భక్తిని చాటుకుంది..

దుర్గమ్మతల్లీ..కలకాలం కాపాడుతల్లీ..
Selfie on the flyover

తాను దుర్గమ్మ భక్తురాలినని, ఈ దుర్గ బ్రిడ్జి కలకాలం నిలవాలని ఆ తల్లిని మొక్కుకున్నానని తెలిపింది.

ఇదిలా ఉండగా కొత్త ఫ్లైఓవర్‌పై చిన్నారులతో సహా పలువురు సెల్ఫీలు దిగుతూ సందడిచేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/