డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్

అమెరికా: భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్.. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడనున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున ఆమె వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నవంబర్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీపడుతున్నారు. ఆయనకు వీపీగా కమలా హారిస్ పోటీలో ఉంటారు. ఒకప్పుడు అధ్యక్ష హోదా కోసం ఇద్దరూ పోటీపడ్డారు. కానీ ఇప్పుడు కమలా హారిస్‌కు .. జోసెఫ్ బైడెన్ ఛాన్సు ఇచ్చారు. కాలిఫోర్నియా సేనేటర్ అయిన కమలా హారిస్‌కు.. భారతీయ-జమైకా వారసత్వ మూలాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పోలీసు సంస్కరణలు చేపట్టాలని ఇటీవల కాలిఫోర్నియా మాజీ అటార్నీ జనరల్ కమలా హారిస్ డిమాండ్ చేశారు. నవంబర్ 3వ తేదీన జరగనున్న ఎన్నికల్లో.. అధ్యక్ష పదవి కోసం డోనాల్డ్ ట్రంప్‌తో బైడెన్ పోటీపడనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/