కమలా హ్యారిస్ తో ఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాని

వ్యాక్సిన్లు పంపుతామని హామీ!

న్యూఢిల్లీ: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తో ఫోన్ లో మాట్లాడారు. కరోనా సెండ్ వేవ్‌తో కష్టాలు పడుతున్న భారత్‌కు అండగా నిలుస్తామని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు.  అంతర్జాతీయంగా 25 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని అమెరికా భావిస్తున్నట్లు కమల వెల్లడించారు. ఈ ప్లాన్ గురించి ఆమె మోడీతో చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత మరో మూడు దేశాల అధినేతలతో కూడా కమల ఈ విషయంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా వ్యాక్సిన్ అందజేస్తామని ఆమె చెప్పారు. కమల ఇచ్చిన హామీకి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/